News

కొడాలి నానికి గుండు గీయించి ఊరేగిస్తాం


చంద్రబాబుపై కొడాలి నాని నోరు పారేసుకుంటున్నారని, ఆయన తీరు అలాగే ఉంటే గుండు గీయించి ఊరేగిస్తామని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. రాజధాని నిర్మాణానికి సీఎం ఎంతగానో శ్రమిస్తున్నారన్నారు. అనునిత్యం రాష్ట్రాభివృద్ధినే కాంక్షించే బాబుపై వైసీపీ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని, అనవసర దీక్షలు మాని రాజధాని నిర్మాణానికి సహకరించాలని చెప్పారు. అలాంటి నేతలు తీరు మార్చుకోవాలని సూచించారు.